ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనంపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa