AP: ఉల్లి ధరలు భారీగా పతనమవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో గతేడాది క్వింటాలుకు అత్యధికంగా రూ.5 వేల వరకు ధర పలకగా.. ప్రస్తుతం రూ.600కు ధర పడిపోయింది. కోడమూరుకు చెందిన ఓ రైతు క్వింటాలు ఉల్లిని కేవలం రూ.400 చొప్పున విక్రయించారు. కాగా, కర్నూలులో 10,469 హెక్టార్లలో రైతులు ఉల్లి సాగు చేశారు. ఉల్లి నాణ్యత, పరిమాణం తక్కువగా ఉండటం వల్ల వ్యాపారులు తగిన ధర చెల్లించకుండా భారీగా కోతలు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa