దసరా, దీపావళి సందర్భంగా పలు మార్గాల్లో నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైళ్లను అక్టోబరు నుంచి నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీ, నరసాపురం నుంచి తిరువణ్ణామలై మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లు అక్టోబరు 5 నుంచి నవంబరు 24 వరకు నడపనున్నారు. హైదరాబాద్- కన్యాకుమారి, కాచిగూడ-మధురై, హైదరాబాద్- కొల్లాం ప్రత్యేక రైళ్లను రేణిగుంట, తిరుపతి మీదుగా నవంబర్ నెలాఖరు వరకు నడపనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa