పోటీ పరీక్షలు రాసే దివ్యాంగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద శాక్ గా మారింది. ఇప్పటివరకు పరీక్షలు రాయడానికి దివ్యాంగులు తామే ఎంచుకున్న వ్యక్తిని స్క్రైబ్ (సహాయకుడు)గా తీసుకురాగలిగేవారు. కానీ తాజాగా కేంద్రం ఈ విధానాన్ని ముగించే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం అవకతవకలను అడ్డుకోవడమేనని సమాచారం. స్క్రైబ్‌లను స్వయంగా ఎంచుకునే అవకాశాన్ని కొంతమంది దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించడంతో, న్యాయసమ్మతమైన, పారదర్శక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), యూపీఎస్సీ (UPSC), ఎస్‌ఎస్‌సీ (SSC) వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇకపై తామే స్క్రైబ్‌లను నామినేట్ చేయాల్సిందిగా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీని ప్రకారం, దివ్యాంగులు ఇకపై తమకు తాముగా స్క్రైబ్ ఎంచుకునే అవకాశం ఉండదు.
దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోణంలో ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. అభ్యర్థుల అవసరాలు, నమ్మకస్తులపై ఆధారపడే పరిస్థితుల నేపథ్యంలో, వారి స్వాతంత్ర్యాన్ని కత్తిరించడమేనా అనే చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa