ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్టినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ వంటి 5 రకాల బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం కోసం మహిళలు ఆధార్, ఓటరు, రేషన్ కార్డును వారి స్థానికతకు గుర్తింపుగా చూపితే సరిపోతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణానికి మంచి ఆదరణ లభిస్తోంది. గతంతో పోలిస్తే ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేస్తోన్న మహిళల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక బస్సుల్లో సీట్ల కోసం ఆడవారు కొట్టుకుంటున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా కూటమి మంత్రి సత్య కుమార్ ఉచిత బస్సు ప్రయాణం పథకం మీద సైటరికల్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. ‘మహిళలు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని బాగా వినియోగించుకున్నారు. ఒకప్పుడు తల్లిగారిటింటికో, అత్తగారింటికో వెళ్లాలంటే.. కొన్ని రోజుల ఆలోచించి.. డబ్బులు సమకూర్చుకుని వెళ్లేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏరోజు చూడాలని అనిపిస్తే ఆ రోజే వెళ్తున్నారు. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఇలా ఒక్కోపూట ఒక్కో ప్రాంతానికి వెళ్తూ.. ఓ సీరియల్ చూసి రావొచ్చు. గతంలో అయితే తోడికోడళ్లు ఫోన్లలో కొట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో.. బస్సుల్లో వెళ్లి మరి కొట్లాడుకుని.. సాయంత్రానికి ఇంటికి వస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఇలాంటి సౌకర్యాన్ని కల్పించారు’ అంటూ ఎద్దేవా చేశారు.
ఆగస్టు 15న ప్రారంభం అయిన ఉచిత బస్సు ప్రయాణానికి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి రోజు సుమారు 18-20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సులన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే త్వరలోనే కొత్త బస్సులు వస్తాయని.. అప్పుడు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగుతున్నప్పటికీ.. అక్కడక్కడ సీట్ల కోసం గొడవలు తప్పడం లేదు.

కొన్ని రోజుల క్రితం విజయనగరంలో సీటు విషయంలో ఓ మహిళకు, వ్యక్తికి గొడవ జరిగిన సంగతి తెలిసిందే. తాను ఆపిన సీటులో వేరే వ్యక్తి కూర్చోవడంతో.. అతడిని లేవమని సదరు మహిళ కోరింది. కానీ ఆ ప్రయాణికుడు లేవను అనడంతో.. ఇద్దరి కొన్ని రోజుల క్రితం విజయనగరంలో సీటు విషయంలో ఓ మహిళకు, వ్యక్తికి గొడవ జరిగిన సంగతి తెలిసిందే. తాను ఆపిన సీటులో వేరే వ్యక్తి కూర్చోవడంతో.. అతడిని లేవమని సదరు మహిళ కోరింది. కానీ ఆ ప్రయాణికుడు లేవను అనడంతో.. ఇద్దరి తో కొట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa