తిరుమల - తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి శ్యామలరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ మళ్లీ ఈవోగా నియమితులయ్యారు. గతంలో మూడున్నరేళ్ల పాటు ఈయన టీటీడీ ఈవోగా పనిచేశారు. ప్రస్తుత ఈవో శ్యామలరావును జీఏడీ (పొలిటికల్)లో కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa