ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటో ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయరాదని నిషేధించే ఎలాంటి చట్టం లేదని స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతోనే ఈ వ్యాజ్యం దాఖలైనట్లు వ్యాఖ్యానిస్తూ, పిల్‌ను కొట్టివేసింది. సమాజానికి ఉపయోగపడే అంశాలపై మాత్రమే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa