ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మరణానంతరం ఆయన రూ. 30,000 కోట్ల ఆస్తిపై జరుగుతున్న పోరాటం కోర్టుకు చేరింది. తన సవతి పిల్లలు తన భర్త వ్యక్తిగత ఆస్తులలో వాటా కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన భార్య ప్రియ కపూర్ సవాల్ చేశారు. కరిష్మా కపూర్ ఇద్దరు పిల్లలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. సంజయ్ మార్చి 21వ తేదీన రాసిన వీలునామాను వ్యతిరేకించారు. ఆ వీలునామాలో తన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ సవతి తల్లి ప్రియకు ఇచ్చారని ఉంది. అయితే ఈ వీలునామా గురించి సంజయ్ కానీ, ప్రియ కానీ మరేఒక్కరూ కానీ.. ఎప్పుడూ తమతో చెప్పలేదని పిల్లలు ఆరోపించారు. అయితే సంజయ్ జూన్ 12వ తేదీన ఇంగ్లాండ్‌లో పోలో ఆడుతూ.. ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు తమ తండ్రి ఆస్తులలో ఒక్కొక్కరికి ఐదవ వంతు వాటా కావాలని కోరుతూ కోర్టుకెక్కారు. కరిష్మా కుమార్తె సమీరా కపూర్ తన తల్లిని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీగా నియమించి పిటిషన్ దాఖలు చేయగా.. ఆమె కుమారుడు కియాన్ మైనర్ కావడంతో తల్లి చట్టబద్ధమైన సంరక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు.
జస్టిస్ జ్యోతి సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కేసు విచారణలో.. ప్రియ కపూర్ తరపు న్యాయవాది రాజీవ్ నాయర్ వాదనలు వినిపించారు."ఈ దావా ఏ మాత్రం నిలబడదు. నేను అతని చట్టబద్ధమైన భార్యను. ప్రేమ, ఆప్యాయతలు అంటూ మాట్లాడుతున్నారు - సుప్రీం కోర్టులో జరిగిన సుదీర్ఘ విడాకుల పోరాటాల సమయంలో ఇవన్నీ ఎక్కడికి పోయాయి? నీ భర్త నిన్ను చాలా సంవత్సరాల క్రితమే వదిలేశాడు" అని కరిష్మాను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సంజయ్, కరిష్మా 2016లో విడాకులు తీసుకోవడంతో ఇలా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా "ప్రతివాదులు (పిల్లలు) కోర్టుకు తీవ్రమైన విడాకుల ప్రక్రియ సుప్రీం కోర్టులో ముగిసిందని చెప్పాలి. అంతగా ప్రేమ ఉందా? ఇప్పుడు మరణించిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. కొంచెం సానుభూతి చూపించండి. నేను ఇప్పుడు వితంతువును. నేను అతని చివరి చట్టబద్ధమైన భార్యను. అప్పుడు మీరెక్కడ ఉన్నారు? నీ భర్త నిన్ను చాలా ఏళ్ల క్రితమే వదిలిపెట్టాడు" అని ప్రియ కపూర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ప్రియ కపూర్ కూడా కరిష్మా పిల్లలకు ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి రూ. 1,900 కోట్ల విలువైన ఆస్తులు లభించాయని పేర్కొన్నారు. "అంతగా ఏడవాల్సిన అవసరం ఏముంది? ట్రస్ట్ కింద ప్రతివాదులకు రూ. 1,900 కోట్ల ఆస్తులు వచ్చాయి. ఎంత ఆస్తి ఉంటే సరిపోతుందో నాకు తెలియడం లేదు" అని ఆమె అన్నారు. పిల్లలు తమ దావాలో తమ తండ్రి వీలునామాను.. ప్రియ కపూర్ ఫోర్జరీ చేసి, మొత్తం ఆస్తులపై పూర్తి నియంత్రణ సాధించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వారు ఆస్తుల విభజన, అకౌంట్ల సమర్పణ, ప్రతివాదులకు వ్యతిరేకంగా శాశ్వత నిలుపుదల ఉత్తర్వుల కోసం కోర్టును కోరారు. ఈ కేసులో ప్రియ, ఆమె మైనర్ కుమారుడు, ఆయన తల్లి రాణి కపూర్, శ్రద్ధా సూరి మర్వాహలను ప్రతివాదులుగా చేర్చారు.
పిటిషనర్ తరపు న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తూ.. "పిల్లలు అడిగినప్పుడు ప్రియ కపూర్ అసలు వీలునామా ఏదీ లేదని చెప్పారు. కొంత ఆస్తి ట్రస్ట్ కింద ఉంది. కొంతకాలం తర్వాత మాజీ భార్య, ప్రస్తుత భార్య మధ్య జరిగిన సమావేశాలు, చర్చల అనంతరం ట్రస్ట్ నిబంధనలపై చర్చించడానికి ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు" అని తెలిపారు. "మొదట ప్రియ కపూర్ మాకు వీలునామా లేదని చెప్పారు. కానీ జులై 30వ తేదీన ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్ సమావేశంలో అకస్మాత్తుగా దివంగత సంజయ్ కపూర్ రాసిన వీలునామా ఒకటి ఉందని మాకు చెప్పారు" అని ఆయన తెలిపారు.
ప్రియ కపూర్ సహచరులైన దినేష్ అగర్వాల్, నితిన్ శర్మ ఏడు వారాలకు పైగా వీలునామాను దాచిపెట్టి.. జులై 30న మాత్రమే కుటుంబ సమావేశంలో బయట పెట్టారని పిల్లలు ఆరోపించారు. "మైనర్లు (సమీరా, కియాన్) మొదటి తరగతి వారసులు. అంత్యక్రియలకు ఒక రోజు ముందు ఆమె ట్రస్ట్‌లో గణనీయమైన వాటాలను నియంత్రించే ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా చేయబడ్డారు" అని అన్నారు. ఈ "ఫోర్జరీ వీలునామా" రిజిస్టర్ కూడా కాలేదని ఆయన అన్నారు. దీనిపై వివరణ కోరగా.. నాయర్ కోర్టుతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీలునామా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.
దీంతో కోర్టు షాకింగ్ తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా మీరు వీలునామా కాపీని పిల్లలకు ఎందుకు ఇవ్వలేదు? వీలునామా ఎక్కడ ఉంది? దయచేసి దానిని అందజేయండని వివరించింది. అలాగే నోటీసులు ఇస్తున్నాము, రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోరింది. సమాధానాలతో పాటుగా ప్రతివాది 1 (ప్రియ) తనకు తెలిసిన అన్ని చరాస్తులు, స్థిరాస్తుల జాబితాను దాఖలు చేయాలని చెప్పింది. జూన్ 12వ తేదీ నాటికి ఆస్తులను ప్రకటించాలని సూచించింది. తదుపరి విచారణ అక్టోబర్ 9వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa