కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగానే మాజీ సీఎం జగన్ విష ప్రచారాన్ని కొనసాగించారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. జాతీయ వైద్య సంఘం 2024-25లో పాడేరు కాలేజీలో ప్రవేశాలను కేవలం 50కే కుదించడానికి మాజీ సీఎం నిర్వాకమే కారణమన్నారు. ఈ విషయంలో ఆయనే పూర్తి దోషి అని చెప్పారు. పీపీపీ విధానంలో నూతన వైద్య కళాశాలల నిర్మాణం, హైబ్రిడ్ విధానంలో అందరికీ ఆరోగ్య బీమా పథకాలపై మీడియా సమావేశంలో జగన్ ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa