కర్ణాటక రాష్ట్రంలోని బండీపుర జాతీయ పార్కులో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పర్యాటకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రమాదకరంగా ఏనుగుకు మరీ దగ్గరగా వెళ్లాడు. దీంతో ఏనుగు అతడిని వెంబడించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ అధికారులు స్పందించారు. ఆ పర్యాటకుడిని గుర్తించి, వన్యప్రాణుల భద్రతకు ముప్పు కలిగించినందుకు రూ. 25,000 జరిమానా విధించారు. బండీపురలో ఏనుగులు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతాయని, పర్యాటకులు వాటికి సురక్షితమైన దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa