నేపాల్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ గురువారం ఓ బహిరంగ ప్రకటన చేశారు. రాజ్యాంగానికి లోబడి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పౌరులు సంయమనం పాటించాలని కోరారు. వీలైనంత త్వరగా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa