గాజులదిన్నె ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 377 మీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 4.50 టీఎంసీలు. హంద్రీ నదిలో భారీగా వరద ప్రవహిస్తోంది. హంద్రీ నీవా కాలవ నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో డ్యాంలోకి 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా గేట్లేత్తే అవకాశం ఉందని హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ, టీబీపీ ఎల్లెల్సీ ఈఈ పాండురంగయ్య తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa