కేరళకు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. తాను స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్‌లో తన తండ్రికే ఉద్యోగమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ యువ సంచలనం పేరు రాహుల్ జాన్ అజు. అతి చిన్న వయసులోనే 'ఆర్మ్ టెక్నాలజీస్' అనే సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తూ టెక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్నాడు.ఆరేళ్ల వయసులోనే ఏఐ ప్రపంచంలోకి అడుగుపెట్టిన రాహుల్ 16 ఏళ్లు వచ్చేసరికి 'మీ-బోట్' అనే రోబోను సైతం నిర్మించాడు. ఇప్పటివరకు 10కి పైగా ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేశాడు. తన తండ్రిని ఉద్యోగంలోకి తీసుకోవడం కేవలం ఓ నియామకం కాదని, బాధ్యత, ఆవిష్కరణలలో అందరినీ భాగస్వామ్యం చేయాలన్న తన నమ్మకానికి ఇది నిదర్శనమని రాహుల్ చెబుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa