మిజోరం అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే అత్యంత కీలకమైన బైరబీ-సైరంగ్ రైల్వే లైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా రూ.9,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో, గువాహటి, అగర్తల, ఇటానగర్ తర్వాత రైలు మార్గంతో అనుసంధానమైన నాలుగో ఈశాన్య రాజధానిగా ఐజ్వాల్ నిలిచింది.51.38 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మూడు కొత్త రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో సైరంగ్-ఆనంద్ విహార్ (ఢిల్లీ) రాజధాని ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి), కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (వారానికి మూడుసార్లు), గువాహటి-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (రోజువారీ) ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మిజోరంలో పర్యాటకం, వాణిజ్యం గణనీయంగా పుంజుకోవడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa