విశాఖలోని రైల్వే మైదానంలో ఆదివారం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. శనివారం రాత్రి ఆయన విశాఖకు చేరుకున్నారు. సభా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 20 వేలకు పైగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు రానున్నారు. కాగా, ఈ నెల 17న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖలో పర్యటించనున్నారు. అలాగే అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఖాదీ సంత నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa