నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధమున్న 16వేల విదేశీయులను దేశం నుంచి బహిష్కరించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వలస చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే వీరిని పలు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకుని నిర్బంధ కేంద్రాలకు తరలించింది. హోం మంత్రిత్వశాఖ వీరిని త్వరలోనే స్వదేశాలకు పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని జాతీయ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa