విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి 'స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, తద్వారా రాష్ట్రం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. "మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ చక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించుకోవాలి" అని ఆయన ప్రజలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'స్వస్త్ నారీ-సశక్త్ పరివార్' కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 13,944 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. "ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు కొనసాగుతాయి. హైబీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లతో పాటు టీబీ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు" అని ఆయన వివరించారు. గైనకాలజీ, ఈఎన్‌టీ, కళ్లు, డెర్మటాలజీ, సైకియాట్రీ వంటి స్పెషలిస్ట్ వైద్యుల సేవలు ఈ క్యాంపుల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa