AP: సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులను పొడిగిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి, విద్యాశాఖ ముందుగా ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుండి సెలవులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ అదనపు సెలవులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa