రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారిందని టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే అన్నారు . పరకామణిలో చోరీ విషయంలోనూ లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్రంలో అలీబాబా అరడజను దొంగల రాజ్యాన్ని నడుపుతూ వైయస్ఆర్‌సీపీపైనా, మా పార్టీ నాయకులపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.శ్రీవారి హుండీ లెక్కింపులో అమెరికన్ డాలర్ నోట్లు చోరీచేస్తూ సి.వి.రవికుమార్ అనేక వ్యక్తి 2023, ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. వాటి విలువ రూ.72,000లుగా విజిలెన్స్ సిబ్బంది నిర్ణయించారు. అంటే ఆ దొంగతాన్ని గుర్తించి, పట్టుకున్నది మా వైయస్సార్‌సీపీ హయాంలోనే కదా? అలాంటిది మాపై ఏరకంగా నిందలేస్తారు? గత రెండుదశాబ్దాలుగా ఇలాంటివి పలుమార్లు చేశానని రవికుమార్ విచారణలో ఒప్పుకున్న నేపథ్యంలో, చంద్రబాబు గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి చోరీలను ఎందుకు అడ్డుకోలేదు?. రవికుమార్ పెద్దజీయంగార్ మఠంలో పనిచేస్తూ, పరకామణి క్లర్కుగా రవికుమార్ వ్యవహరిస్తున్నారని అధికారులు అప్పుడు పోలీసులు తేల్చారు. మరింత విచారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించిచారు. ఈ కేసును నిశితంగా పోలీసులు విచారించి, వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. శ్రీవారి పరకామణిలో చోరీ విషయాన్ని వారికి తెలియజేశారు. అపరాధానికి పాల్పడినట్టుగా రవికుమార్ ఒప్పుకున్నారు. ప్రాయశ్చితంగా తన ఆస్తులను స్వామివారికి గిఫ్టు రూపంలో ఇచ్చుకుంటామని రవికుమార్, అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈకేసులో 2023లో మేలో ఛార్జి షీటు దాఖలు చేస్తే, 2023లో జూన్‌లో, టీటీడీకి గిఫ్టుగా దాదాపు రూ.14.43 కోట్ల ఆస్తులను రవికుమార్, అతని కుటుంబ సభ్యులు రాసిచ్చారు. దీనిపై టీటీడీ బోర్డు తీర్మానం అయిన తర్వాత లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారం కోసం 2023 జులై నెలలో అర్జీ దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియను అనుసరించి ఈ కేసు పరిష్కారం అయ్యింది. ఇవీ జరిగిన వాస్తవాలు. అత్యంత పారదర్శకంగా, న్యాయ బద్ధంగా, ధర్మ బద్ధంగా సాగిన ఈ ప్రక్రియపై చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ఆట ఆడుతోంది. గత రెండు దశాబ్దాలుగా పలుమార్లు తాను పలుమార్లు తప్పుచేశానని రవికుమార్ చెప్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పరకామణిలో చోరీ జరుగుతున్న విషయాన్ని పట్టుకోలేకపోయింది? చంద్రబాబు గత పరిపాలనా కాలంలో రవికుమార్ దొరికి ఉంటే.. ఆయన ఆస్తులు టీటీడీకి కాకుండా టీడీపీకి వెళ్లేవన్న మాట నిజం కాదా? పంచాయతీలు చేసి, ఆ ఆస్తులను టీటీడీకి కాకుండా మీ ఖాతాల్లోకి, మీ టీడీపీ నాయకుల ఖాతాల్లోకి వేసుకునేవారు కదా? ఇప్పుడు ఇంగితం మరిచి మరోసారి తిరుమల క్షేత్రాన్ని అడ్డుపెట్టుకుని అబద్ధాలు, విష ప్రచారాలు చేయడం సమంజసం కాదు. దేవుడంటే మీకు భయం లేదు, భక్తిలేదని మరోసారి నిరూపణ అయ్యింది. రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారుతారని ప్రతి రోజూ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆ వేంకటేశ్వర స్వామే వీరికి సరైన బుద్ధి చెప్తాడు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa