భారత్-పాకిస్థాన్ మధ్యే కాకుండా, థాయ్‌లాండ్-కంబోడియా, ఆర్మేనియా-అజర్‌బైజాన్, సెర్బియా-కొసోవో సహా మొత్తం ఏడు యుద్ధాలను తాను ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. తాను ఆపిన వాటిలో 60 శాతం వాణిజ్య సంబంధాల ద్వారానే సాధ్యమయ్యాయని ఆయన తెలిపారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ బహుమతి వస్తుందని కొందరు తనతో అన్నారని చెబుతూ, "మరి నేను ఆపిన ఈ ఏడు యుద్ధాల సంగతేంటి? నాకు ప్రతిదానికీ ఒక నోబెల్ బహుమతి రావాలి కదా?" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని, అందుకే రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడం సులభమని తాను భావించానని, ఏదో ఒక విధంగా దాన్ని కూడా పరిష్కరించి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa