2019-24 మధ్య కాలంలో తప్పుడు క్రిమినల్ కేసుల పరిష్కారంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు అడిగిన ప్రశ్నకు హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. ఈ మేరకు వంగలపూడి అనిత ఇచ్చిన సమాధానాన్ని నిరసిస్తూ మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. గత ప్రభుత్వం చాలా మందిపై అక్రమ కేసులు పెట్టిందని అనిత ఆరోపించారు. అమరావతి రైతులు రాజధాని కోరుకుంటే వందలాది మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa