స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) డెల్హీ పోలీస్ సర్వీస్‌లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాదే మొత్తం 7,565 పోస్టులు భర్తీ చేయనున్నారు. పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సెప్టెంబర్ 22, 2025 నుంచి ప్రారంభమైనాయి.
*పోస్టుల విభజన:
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – పురుషులు: 4,408
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – మహిళలు: 2,496
ఎక్స్-సర్వీస్‌మెన్ (పురుషులు, ఇతరులు): 285
ఎక్స్-సర్వీస్‌మెన్ (పురుషులు, కమాండో): 376
*అర్హత: కనీస విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత.డెల్హీ పోలీస్ సిబ్బంది కుమారులు/కుమార్తెలు, బ్యాండ్స్‌మెన్, బగ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్ వంటివారు నోటిఫికేషన్లో సూచించిన విధంగా సడలింపు పొందుతారు.పురుష అభ్యర్థులు PE & MT తేదీకి ముందుగా చెల్లుబాటు అయ్యే LMV (మోటార్‌సైకిల్/కారు) డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
*వయోపరిమితి: జులై 1, 2025 నాటికి 18–25 ఏళ్ళ మధ్య.
SC/ST అభ్యర్థులకు: +5 సంవత్సరాలు
OBC అభ్యర్థులకు: +3 సంవత్సరాలు
*దరఖాస్తు మరియు ఫీజు: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21.10.2025,దరఖాస్తు ఫీజు (జనరల్): ₹100 SC/ST, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, దివ్యాంగుల కోసం ఫీజు లేదు,ఫీజు చెల్లింపు చివరి తేదీ: 22.10.2025
*దరఖాస్తు సవరణలు: 29–31 అక్టోబర్, 2025
*ఎంపిక ప్రక్రియ:ఆన్లైన్ రాత పరీక్ష
ఫిజికల్ ఎండ్యూరెన్స్ & మెజర్మెంట్ టెస్ట్ (PE & MT)
మెడికల్ ఎగ్జామినేషన్
*జీతం: ఎంపికైనవారికి నెలకు ₹21,700–₹69,100 వరకు జీతం అందుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa