యోగాలో అన్ని అనారోగ్యాలకు పరిష్కారం ఉంటుంది. కాకపోతే వాటి గురించి సరైన అవగాహన ఉండి తీరాలి. శరీరంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే అందుకు యోగా గొప్ప మందుగా పని చేస్తుంది. రకరకాల ఆసనాలు వ్యాధును దూరం చేయడంలో సాయపడతాయి. అంతే కాదు. బాడీ ఫిట్ గా ఉండేలా చేస్తాయి. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడతాయి. అయితే చాలా మంది బాడీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారు.
కొవ్వు విపరీతంగా పేరుకుపోతోంది. కరిగించుకోడానికి చాలా కష్టాలు పడుతున్నారు. జిమ్ కి వెళ్లి భారీ వర్కౌట్స్ చేస్తున్నారు. వీటి వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ ఇంట్లోనే చాలా సులువైన వ్యాయామాలు కొన్ని చేసి బరువు తగ్గవచ్చు. అదే విధంగా కొవ్వుని కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ 5 రకాల యోగాసనాలు ఏంటి. ఏం చేస్తే బరువు తగ్గుతారు. కొవ్వు త్వరగా కరిగిపోతుందో చూద్దాం.
దేవి ఆసన
దేవి ఆసన. దీన్నే గాడెస్ ఫోజ్ అని కూడా అంటారు. ఉదయం తప్పనిసరిగా చేయాల్సిన ఆసనాల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా కాళ్లను, మడమలను బలోపేతం చేయడంలో ఈ ఆసన ఎంతోగానో తోడ్పడుతుంది. అంతే కాదు. బాడీ బ్యాలెన్స్ పెరగడానికి కూడా సహకరిస్తుంది. ఛాతి, నడుము, కాళ్ల కండరాలు స్ట్రెచ్ అవుతాయి కాబట్టి రక్త సరఫరా మెరుగవుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గడంతో పాటు రుతుక్రమం సరిగ్గా రాకపోయినా ఆ సమస్య కూడా తగ్గిపోతుంది.
ఈ ఆసనం చేయాలంటే ముందుగా రెండు పాదాలను కాస్త దూరంగా ఉంచాలి. కనీసం రెండు మూడు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. మోకాళ్లను వంచాలి. పాదాలపై ప్రెజర్ పడేలా చూసుకోవాలి. స్క్వాట్స్ చేసినట్టుగానే ఉన్నప్పటికీ ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. పూర్తిగా నడుము కింది వరకూ వంచాల్సిన అవసరం లేదు. భుజాలను కదుపుతూ చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచాలి. యోగా ఎక్స్ పర్ట్ ఒకరు ఈ ఆసనం ఎలా చేయాలో చూపించారు. ఈ వీడియో ఆధారంగా మీరు ఫాలో అయిపోవచ్చు. ఈ ఆసనం కనీసం 5-10 రౌండ్స్ పాటు చేస్తే ఫ్యాట్ కరిగిపోతుంది.
వీరభద్రాసన
వీరభద్రాసన కూజా చాలా పవర్ ఫుల్. ఈ ఆసనం వేయడం చాలా సింపుల్. కానీ ఫలితాలు మాత్రం చాలా బాగుంటాయి. తొడలు, నడుము కండరాలు స్ట్రెచ్ అవుతాయి. ఫలితంగా తొడల్లో పేరుకున్న కొవు క్రమంగా తగ్గిపోతుంది. బరువు తగ్గుతారు. ఇక పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కూడా కరుగుతుంది. ఫలితంగా సన్నబడతారు. అయితే..ఈ వీరభద్రాసనం కనీసం పది సార్లు చేయాలి. అయితే 5 సార్లు ఓ వైపు..మరో 5 సార్లు మరో వైపు చేయాలి.
ఇలా చేయడం వల్ల బాడీ బ్యాలెన్స్ అవుతుంది. కండరాలు స్ట్రెచ్ అవడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. ముఖ్యంగా ఇది కోర్ స్ట్రెంత్ పెంచడంలో తోడ్పడుతుంది. ఓ మోకాలును వంచి మరో కాలుని బాగా స్ట్రెచ్ చేసి ఈ ఆసనం వేయాల్సి ఉంటుంది. రోజూ ప్రాక్టీస్ చేస్తే ఇందాక చెప్పిన ప్రయోజనాలు అందుతాయి. అంతే కాకుండా కొవ్వు వేగంగా కరిగిపోతుంది.
వీరభద్రాసన II
వీర భద్రాసనలో మొత్తం మూడు రకాలుంటాయి. ఇందాక చెప్పుకుంది మొదటి రకం. అయితే రెండో రకం ఆసనంతో మరింత ఫలితాలు ఉండే అవకాశముంటుంది. ఈ ఆసనం వేసినప్పుడు చేతులు, ఛాతి, కాలి కండరాలు స్ట్రెచ్ అవుతాయి. ఫలితంగా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. గుండెపైనా ఒత్తిడి పడదు. వీరభద్రాసనలో ఉండే ప్రత్యేకత ఏంటంటే..మిగతా ఆసనాతో పోల్చిచూస్తే చాలా వేగంగా కొవ్వు కరిగిపోతుంది.
శరీరానికి తక్షణమే శక్తిని ఇవ్వడంలో తోడ్పడుతుంది. ఫోకస్ పెంచడంలోనూ వీరభద్రాసన ఎంతో ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణను మెరుగు పరచడంతో పాటు బలాన్ని అందిస్తుంది. దీన్ని వారియర్ పోజ్ అని కూడా పిలుస్తారు. కాళ్లతో పాటు భుజాలు, ఛాతి, ఊపిరితిత్తులు కండరాలను బలపరచండంలోనూ సాయపడుతుంది. ఈ ఆసనాన్ని కనీసం 2 నుంచి 5 సెట్స్ వరకూ చేస్తే కొవ్వు సులువుగా కరిగిపోతుంది.
సర్వాంగ పుష్టి ఆసనం
వీరభద్రాసన తరవాత ఆ స్థాయిలో శరీరంలోని కొవ్వుని కరిగించేందుకు ఉపయోగపడేదే ఈ సర్వాంగ ముష్టి ఆసనం. చేయడం సులువే. అయితే..క్లాక్ వైజ్ గా ఓ 10 సార్లు యాంటీ క్లాక్ వైజ్ గా ఓ 10 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే సరైన ఫలితాలు దక్కుతాయి. ఇది బాడీ బ్యాలెన్స్ పెంచడంలో ఎంతో సాయపడుతుంది. కొవ్వుని కరిగించడం సహా కండరాలను బలపరచడంలో తోడ్పడుతుంది. బాజీ ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఓ పది సార్లు చేయాలి. సమయాన్ని బట్టి ఈ సంఖ్యను పెంచుకుంటూ పోవచ్చు. తద్వారా నడుము భాగం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa