ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నిన్న ప్రార్థనల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నిరసనలకు పిలుపునిచ్చిన స్థానిక మత గురువు, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ అయిన తౌకీర్ రజాను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ‘ఐ లవ్ మహమ్మద్’ ప్రచారానికి మద్దతుగా ఆయన చేసిన ఓ వీడియో పిలుపుతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు అధికారులు తెలిపారు. ఓ పోస్టర్ వివాదం నేపథ్యంలో గత కొన్ని వారాలుగా చెలరేగుతున్న ఆందోళనల్లో భాగంగా శుక్రవారం బరేలీలో భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే, ఈ ర్యాలీ కొద్దిసేపటికే హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడటంతో, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో సుమారు 10 మంది పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa