ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు అద్భుతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 05:07 PM

విజయవాడలో జరుగుతున్న ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన మైసూరు, కోల్‌కతా వేడుకలను సైతం అధిగమించాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. ‘విజయవాడ ఉత్సవ్‌’ జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుందని ఆయన అన్నారు. సోమవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని)తో కలిసి పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న వేడుకలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. పండుగలు, ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించి, మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడతాయని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి సుదూర ప్రాంతాల నుంచి కళాకారులను ఆహ్వానించి, కళావైభవానికి పెద్దపీట వేయడం అద్భుతమని కొనియాడారు. సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధితో పాటు కళల పరిరక్షణకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa