స్కోడా కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన కైలాక్ కారు అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకుంది. కేవలం 8 నెలల్లోనే 30,000కి పైగా యూనిట్ల సేల్స్ సాధించింది.ఈ విజయవంతమైన అమ్మకాలు స్కోడా కంపెనీకి సేల్స్ పెంపుకు కీలకంగా సహాయపడ్డాయి.2025 జనవరిలో 1,242 యూనిట్లు విక్రయించిన కైలాక్, ఆగస్టు వరకు నెల సేల్స్ 3,099 యూనిట్లకు చేరుకుంది. మొత్తం జనవరి నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఈ మోడల్ 30,190 యూనిట్లు అమ్మకాలు నమోదు చేసింది. ఈ కారు దేశీయ మార్కెట్లో రూ. 7.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.స్కోడా కైలాక్ 1.10 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 115 హార్స్ పవర్ మరియు 178 న్యూటన్ మీటర్ టార్క్ ను అందిస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభ్యం.ఈ కారు క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ మరియు ప్రెస్టీజ్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో, ఏడు వివిధ రంగుల్లో విస్తృతంగా లభ్యమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa