ఆసియా కప్ 2025 ట్రోఫీ చుట్టూ నడుస్తున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఈ వివాదంపై స్పందిస్తూ, ట్రోఫీని తనతో తీసుకెళ్లిన విషయంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కి క్షమాపణలు తెలిపినట్లు సమాచారం. ఇది క్రికెట్ డిప్లమసీలో ఒక పాజిటివ్ స్టెప్గానే భావించబడుతోంది.
అయితే, ట్రోఫీ తిరిగిచ్చే విషయంలో నఖ్వీ ఓ కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన చెబుతోన్నదాని ప్రకారం, ట్రోఫీని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆఫీస్‌కు వచ్చి స్వీకరించాల్సిందే. ఇది సాధారణ శిస్టభద్రత చర్య కాదని, వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయమని పాకిస్థాన్ మీడియా చెబుతోంది.
ఈ షరతుపై బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ట్రోఫీ స్వీకరణకు టీమిండియా కెప్టెన్‌ను పాక్‌లోని ఏసీసీ ఆఫీస్‌కు పంపించాలన్న నఖ్వీ డిమాండ్‌ను బీసీసీఐ ఎలా సమాధానమిస్తుంది అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ వివాదం క్రికెట్ డిప్లమసీకి తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
ఇప్పటికే పాకిస్థాన్-భారత్ క్రికెట్ సంబంధాలు రాజకీయ కారణాల వల్ల తేలికగా లేవు. ఈ ట్రోఫీ వివాదం నేపథ్యంలో రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఏసీసీ అధ్యక్షుడిగా నఖ్వీ చురుగ్గా వ్యవహరించడంతో పాటు, ఈ వివాదానికి పరిష్కారం చూపే మార్గం కూడా ఆయన చేతులలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa