ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండుగరోజున​ముఖంఫేషియల్ వేసుకున్నట్లుగా మెరిసిపోవాలా ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 12:00 AM

బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో, స్కిన్‌కి కూడా అంతే మంచిది. దీనిని వాడడం వల్ల స్కిన్‌ప్రాబ్లమ్స్ చాలా వరకూ దూరమై స్కిన్ మెరుస్తుంది. బీట్‌రూట్‌లో ముఖ్య పోషకాలు అయిన విటమిన్ సి, జింక్, పొటాషియం వంటివి ఉన్నాయి. ఇవి స్కిన్‌పై ఉన్న ట్యాన్‌ని ఇన్‌స్టంట్‌గా దూరం చేస్తాయి. స్కిన్ బ్రైట్‌గా కనిపించేలా చేస్తాయి. దీనిని వాడడం వల్ల డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. మాయిశ్చర్ పెరుగుతుంది. బీట్‌రూట్‌తో మనం ఫేషియల్ చేసుకోవచ్చు. దీని కోసం మనం జ్యూస్‌ని వాడతాం. తాగిన కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. బ్లడ్ సర్క్యూలేషన్‌ని పెంచుతుంది. నేచురల్‌గానే స్కిన్ మెరిసేలా చేస్తుంది. పండుగలు, ఫంక్షన్స్ టైమ్‌లో దీనిని వాడితే ఆ లుక్ ఫేషియల్స్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీనికోసం బీట్‌రూట్‌ని ఎన్నిరకాలుగా వాడొచ్చో తెలుసుకుందాం.


బీట్‌రూట్, టర్మరిక్ ఫేస్ ప్యాక్


కావాల్సిన పదార్థాలుచిన్న బీట్‌రూట్అర టీస్పూన్ పసుపుతయారీ విధానం బీట్‌రూట్‌ని తురిమి పెట్టాలి. దీని నుంచి జ్యూస్ తీయాలి. ఈ జ్యూస్‌లో పసుపు వేసి కలిపి పేస్టులా చేయాలి. దీనిని ముఖం, మెడకి రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయాలి. బెనిఫిట్స్


పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కిన్‌ని శాంతపరిచి, నలుపుదనాన్ని తగ్గిస్తాయి.


బీట్‌రూట్, తేనె ఫేస్‌ప్యాక్


కావాల్సిన పదార్థాలుచిన్న బీట్‌రూట్1 టేబుల్ స్పూన్ తేనెతయారీ విధానం


ముందుగా బీట్‌రూట్‌ని తురుముకోవాలి. అందులో నుంచి జ్యూస్ తీయాలి.


ఇందులోనే తేనె కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ముఖం, మెడకి రాయాలి. 20 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కడిగి ముఖాన్ని తుడవాలి. బెనిఫిట్స్


​తేనె నేచురల్‌గానే స్కిన్‌‌కి మాయిశ్చర్‌ని అందించి స్కిన్‌ని స్మూత్‌గా చేస్తుంది. బీట్‌రూట్‌లోని నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి స్కిన్‌ని హెల్దీగా, రేడియెంట్ లుక్ వచ్చేలా చేస్తుంది.


కావాల్సిన పదార్థాలు


1 చిన్న బీట్‌రూట్


2 టేబుల్ స్పూన్ల పెరుగుఏం చేయాలి? ముందుగా బీట్‌రూట్‌ని తురమాలి. ఈ తురుము నుంచి జ్యూస్ తీయాలి. దీనిని పెరుగుతో కలపాలి. స్మూత్‌పేస్టులా చేయాలి. దీనిని ముఖానికి, మెడకి రాయాలి. 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో క్లీన్ చేసి గుడ్డతో అదుముకోవాలి. బెనిఫిట్స్ఈ ఫేస్‌ప్యాక్ నేచురల్ బ్లీచింగ్ గుణాలని కలిగి ఉంది. దీని వల్ల స్కిన్ లైట్‌గా మారుతుంది. ట్యాన్ తగ్గుతుంది. పెరుగులోని చలువ చేసే గుణాలు స్కిన్‌ని స్మూత్‌గా చేస్తుంది. దీనిని రాయడం వల్ల నేచురల్ ఎక్స్‌ఫోలియేట్‌గా పనిచేస్తుంది.


బీట్‌రూట్, లెమన్ ఫేస్‌ప్యాక్


కావాల్సిన పదార్థాలు1 చిన్న బీ‌ట్‌రూట్1 టేబుల్ స్పూన్ నిమ్మరసంఏం చేయాలి.


ముందుగా బీట్‌రూట్‌ని తురిమి పెట్టుకోవాలి. ఇందులోనుంచి జ్యూస్ తీయాలి. దీనికి నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకి పట్టించాలి.


15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు ఉండి తర్వాత క్లీన్ చేసుకోవాలి.


దీనిని చల్లని నీటితో కడిగి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.


బెనిఫిట్స్


నిమ్మ నేచురల్ స్కిన్ బ్రైటెనింగ్‌లా పనిచేస్తుంది. ఇందులోని గుణాలు నల్ల మచ్చల్ని తగ్గిస్తాయి. బీట్‌రూట్ బ్రైటెనింగ్ గుణాలని కలిగి స్కిన్‌ని మెరిసేలా చేస్తాయి.


బీట్‌రూట్ అలోవెరా ఫేస్‌ప్యాక్


కావాల్సిన పదార్థాలు1 చిన్న బీట్‌రూట్1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ఏం చేయాలి.


ముందుగా బీట్‌రూట్‌ని తురిమి పెట్టుకోవాలి. అందులోనుంచి జ్యూస్ తీయాలి.


అందులో అలోవెరా జెల్ కలపాలి. దీన్నంతటిని ముఖం, మెడకి రాయాలి. 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ​


బెనిఫిట్స్


ఇందులో కలిపి అలోవెరా కారణంగా స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. దీని వల్ల స్కిన్ మరింత మెరుస్తుంది. బీట్‌రూట్‌లోని నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, అలోవెరాతో కలిసి క్లియర్ గ్లోయింగ్ స్కిన్‌ని అందిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa