పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ వీరంగం సృష్టించారు. గుడ్ మార్నింగ్ హోటల్ యజమానిపై నాగార్జున యాదవ్ దాడికి పాల్పడ్డారు. టైంకి టిఫిన్ తేలేదని హోటల్ యజమాని శేఖర్, సిబ్బందిపై ఆయన అనుచరులతో కలిసి దాడికి దిగారు. ఈ ఘర్షణలో హోటల్ సిబ్బందిలో ఇద్దరికి గాయాలయ్యాయి. హోటల్ యజమాని శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో నాగార్జున యాదవ్‌పై కేసు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa