ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ను బ్రిటీషర్లు పాలించలేదా.. 200 ఏళ్లు దోచుకున్నది ఎవరు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 08:21 PM

ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ .. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అందులో భాగంగా తన ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్టులు పెడతారు. తాజాగా భారతీయులను రెచ్చగొట్టే పోస్టుకు ఎలాన్ మస్క్ లైక్ కొట్టారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎప్పుడూ పరిపాలించలేదని వింతగా పేర్కొన్న పోస్టును మస్క్ లైక్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. మస్క్ పోస్ట్‌ను లైక్ చేయడమే కాకుండా "ఆలోచిస్తున్నట్లు ఉన్న ఎమోజీని షేర్ చేశారు. కొద్ది క్షణాల్లోనే ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. దాదాపు ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో భారతీయుల నుంచి తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయ. ఎలాన్ మస్క్‌పై తీవ్ర ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు ఇండియన్స్.


ఆ పోస్టులో.. "భారతీయులు ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టి ఆంగ్లేయులుగా మారితే.. భారతదేశంలో అడుగు పెట్టిన ఆంగ్లేయులు భారతీయులయ్యారు. కాబట్టి, ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలించలేదు. 'వలసరాజ్యం' అనేదే లేదు." అని ఉంది. ఇది భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. దీనిపై భారత యూజర్లు మస్క్‌కు బుద్ధి చెప్పే విధంగా కామెంట్లు పెడుతున్నారు.


అందులో ఓ యూజర్.. "భారతీయులు ఇంగ్లాండ్ వనరులను దోచుకోవడం లేదు. బ్రిటీష్ పౌరులను హింసించడం లేదు. భారతీయులు.. గ్రేట్ బెంగాల్ ఫెమైన్ (1943) లాగా కరువులను సృష్టించడం లేదు. జలియన్ వాలాబాగ్ (1919)లోలా.. భారతీయులు బ్రిటీష్ వారిని ఊచకోత కోయడం లేదు. ఇండియన్స్ ఉప్పుపై పన్నులు విధించడం లేదు.. బ్రిటీష్ పరిశ్రమలను నాశనం చేయడం లేదు. అంతేకాకుండా బ్రిటీషర్లలా.. భారతీయులు వారిని సెల్యులార్ జైలుకు తరలించడం. రౌలత్ వంటి చట్టాలను అమలు చేయడం లేదు. భారత్, పాకిస్థాన్ విభజన సమయంలో ఉన్న పరిస్థితి బ్రిటీష్‌కు కల్పించలేదు" అని ఎలాన్ మస్క్‌కు చురకలు అంటించాడు.


తెల్ల జాతీయుల అహంకారమా..!


మరొకరు ఘాటుగా స్పించాడు. "తెల్ల జాతీయవాదులు.. వలస వాదుల సైనిక దండయాత్ర, అత్యాచారం, దోపిడీని.. చట్టబద్ధమైన వలసలు, న్యూట్రలైజేషన్‌ రెండూ ఒకటని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మైనారిటీలను దుర్భాషలాడుతూ.. వలసవాద అపరాధాన్ని ఏం జరగనట్లు మార్చడమే వారి లక్ష్యం" అని ఏకిపారేశాడు.


భారత్‌కు నష్టపరిహారం ఇవ్వండి..


మరో నెటిజన్ భారత్‌కు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. "మీరు కోరుకుంటే భారతీయులను.. భారత్‌కు తిరిగి పంపండి. కానీ మీరు దొంగిలించిన ధనాన్ని (వడ్డీతో సహా) చెల్లించండి. మీరు చంపేసిన వారికి, మీరు కలిగించిన కరువులు, దోచుకున్న మాన్యుస్క్రిప్ట్‌లు, కళాఖండాలు, మీరు పంపిన మిషనరీలకు నష్టపరిహారం చెల్లించండి. మీరు వచ్చినప్పుడు మేము రసీదుపై సంతకం చేసిస్తాము" అని కామెంట్ చేశాడు.


ఎలాన్ మస్క్ చారిత్రక రివిజనిజాన్ని (చరిత్రను మార్చి చూపించడం) సపోర్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది , బ్రిటిష్ సామ్రాజ్యం “ప్రపంచ బానిసత్వాన్ని అంతం చేసింది” అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ ప్రకటనలతో శతాబ్దాల దోపిడీని.. చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలను ఎదుర్కొన్నారు. తన చేతిలోనే సోషల్ మీడియా ఉంది కదా అని.. ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారు అనే విషయం మస్క్ గుర్తించుకోవాలని హితవు పలుకుతున్నారు భారతీయులు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa