అల్లాన్ని మనం వంటల్లో వాడే పదార్థంగానే చూస్తాం. కానీ, ఇది అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలనిస్తుంది. దీనిని ఊరికే అలా తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ నుంచి వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా, దగ్గు, జలుబు, గొంతునొప్పులను తగ్గించడంలో ఇదో మెడిసిన్‌లా పనిచేస్తుంది. దీనిని మనం వంటలతో పాటు టీలా చేసుకుని కూడా తాగుతాం. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని సాధారణంగా వాడే ముందు పీల్ చేస్తాం. దానిని పారేస్తుంటారు. కానీ, ఈ అల్లం పొట్టుని కూడా చాలా రకాలుగా వాడొచ్చు. అల్లం పొట్టుని మనం స్టోర్ చేసి కడిగి ఆరబెట్టి ఉంచాలి. దీనిని మనం వంటల దగ్గర్నుంచీ ఇంట్లో అనేక పనులకి వాడొచ్చు. దీనిని వాడడం వల్ల వంటలకి రుచి పెరగడమే కాదు. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఫ్లేవర్డ్ టీ
చాలా మంది టీ చేసుకుంటారు. అప్పుడప్పుడు అల్లం టీ చేస్తుంటారు. అయితే, అల్లం నేరుగా వాడకపోయినా అల్లం తొక్కని వేసి చూడండి. మీకు అదే టేస్ట్ వస్తుంది. కాకపోతే కాస్త ఎక్కువ పరిమాణంలో వేయాలి. దీనిని మనం పాలతో తయారుచేసినప్పుడైనా, నీటితో తయారు చేసినప్పుడైనా వేయొచ్చు. కొంతమంది, లెమన్, మింట్ టీ, బ్లాక్ టీలు చేసుకుని తాగుతుంటారు. అలాంటివాటిల్లోకి కూడా అల్లం పొట్టు మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది.
కుకింగ్ ఆయిల్‌లో
మీరు వంటలు చేసే నూనెల క్యాన్స్‌లో కొద్దిగా అల్లం పొట్టుని వేయండి. దానిని పూర్తిగా కడిగి ఆరాకనే వేయాలి. అప్పుడు మెల్లిమెల్లిగా ఆ ఫ్లేవర్ నూనెలకి పడుతుంది. దీంతో వంట చేస్తే మంచి ఫ్లేవర్‌ఫుల్ ఆయిల్‌ని వాడినట్లుగా ఉంటుంది. ఇవి వంటల రుచిని పెంచేస్తాయి. వంటలకి మంచి కొత్త ఫ్లేవర్ వస్తుంది. పైగా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.
సూప్స్
మీరు ఏవైనా సూప్స్ చేసినప్పుడు అందులో కొద్దిగా అల్లం పొట్టు వేసి చూడండి. ఆ సూప్స్ మంచి ఘాటుగా రుచిగా ఉంటాయి. వర్షాకాలం, చలికాలంలో ఇలా తయారైన సూప్స్ మహారుచిగా ఉంటాయి. వీటి ఫ్లేవర్ కూడా ఎంతగానో బాగుంటుంది. అయితే, సర్వ్ చేసేటప్పుడు వాటిని తీసేయడం మంచిది. లేదంటే కొంతమందికి తొక్క నచ్చకపోవచ్చు.
జుట్టుకి
చాలా మంది అల్లం రసాన్ని జుట్టుకి రాస్తుంటారు. అయితే, పొట్టుని మనం కాస్తా నీటిలో వేసి మరిగించి ఆ నీటితో తలని క్లీన్ చేసుకుంటే స్కాల్ప్ హెల్దీగా మారుతుంది. జుట్టుకి మెరుపు వస్తుంది. పైగా చుండ్రు వంటి సమస్యలు దూరమవుతాయి. వీటిని మనం జుట్టు పెరుగుదలకి కూడా వాడుకోవచ్చు. దీనిని స్ప్రే బాటిల్‌లో వేసి అప్పుడప్పుడు తలపై, జుట్టుపై స్ప్రే చేయండి.
చెట్లకి ఎరువులా
మన ఇంట్లో చెట్లని పెంచినప్పుడు వాటికి రకరకాల ఎరువులు వేస్తుంటాం. అయితే, ఈ పొట్టుని వేయడం వల్ల వాటిలోని గుణాలు మొక్కలకి సహజ ఎరువులా ఉపయోగపడి చెట్లు చక్కగా పెరిగేలా చేస్తాయి. ఈ సారి పారేసే బదులు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అల్లంపొట్టుని ఇంట్లో వంటలకి, డ్రింక్స్ తయారీకి, సూప్స్ కోసం, క్లీనింగ్ కోసం ఎలా అయినా వాడొచ్చు.
వెనిగర్ బదులు
మనం ఇంట్లో కొన్ని వస్తువుల్ని క్లీన్ చేయడానికి వెనిగర్‌ని వాడతాం. అలాంటి టైమ్‌లో అల్లం పొట్టు కూడా బాగా పనిచేస్తుంది. కొద్దిగా నీటిలో కాస్తా డిష్‌వాష్, కొద్దిగా అల్లం పొట్టు వేయండి. దానిని అలానే ఉంచండి. ఆ తర్వాత ఆ నీటితోనే వస్తువుల్ని క్లీన్ చేయండి. దీంతో అల్లం పొట్టులోని క్లెన్సింగ్ గుణాలు మరకల్ని ఈజీగా పోగొడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa