చెక్కులకు సంబంధించి ఆర్బీఐ నేటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. గతంలో చెక్కుల క్లియరెన్న్‌కు ఒకటి, రెండు పని దినాలు పట్టేది. ఇకపై కొద్ది గంటల్లోనే క్లియర్ కానున్నాయి. చెక్కు ట్రంకేషన్ సిస్టం ఆధారంగా ఈ కొత్త పద్ధతి పనిచేస్తుంది. చెక్కును ఫిజికల్ బ్యాంకుకు పంపాల్సిన అవసరం ఉండదు. దాని ఫొటో, వివరాలు పంపితే వెంటనే క్లియర్ అవుతాయి. అటు చెక్కుల భద్రతను పెంచడానికి పాజిటివ్ పే సిస్టమ్‌ను ఆర్బీఐ తప్పనిసరి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa