లాంగ్ కోవిడ్‌తో బాధపడుతున్న వారిలో, ముఖ్యంగా మధ్యవయస్కులైన మహిళల్లో ఒక అసాధారణ గుండె సంబంధిత రుగ్మత ఎక్కువగా కనిపిస్తోందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. 'పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాకీకార్డియా సిండ్రోమ్' (పాట్స్) అనే ఈ సమస్య లాంగ్ కోవిడ్ రోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడైంది.'పాట్స్' అనేది పడుకున్న స్థితి నుంచి నిలబడినప్పుడు గుండె వేగం అసాధారణంగా పెరిగే ఒక రకమైన ఆరోగ్య సమస్య. ఈ రుగ్మతతో బాధపడేవారికి నిలబడటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. తీవ్రమైన అలసట, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. ఇవి లాంగ్ కోవిడ్ లక్షణాలను పోలి ఉండటం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa