పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థినులు పచ్చకామెర్లతో బాధపడుతుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పచ్చకామెర్ల వ్యాధి 5 శాతం కంటే ఎక్కువ ఉన్న విద్యార్థినులను అధికారులు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు పార్వతీపురం ఆసుపత్రిలో గురుకులం సెక్రటరీ గౌతమి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినిలు పచ్చకామెర్ల బారిన పడడానికి గల కారణాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు.ఈ విషయంపై రాష్ట్రస్థాయి అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్నారని గౌతమి పేర్కొన్నారు. నీటి వల్ల ఈ వ్యాధి వచ్చిందనే అనుమానంతో అక్కడ వాటర్‌ను పరీక్షించినట్లు తెలిపారు. నీటిలో ఎటువంటి సమస్య లేదని నిర్ధారణ అయిందని వివరించారు. పచ్చకామెర్లు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్న విద్యార్థినులు మొత్తం 36 మంది ఉన్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 120 మంది విద్యార్థినిలు చికిత్సపొందుతున్నట్లు గౌతమి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa