భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చేసిన ఒక చిన్న విజ్ఞప్తికి తక్షణ స్పందన లభించింది. ఆమె సూచన మేరకు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఇద్దరు దిగ్గజ మహిళా క్రికెటర్ల పేర్లతో స్టాండ్లను ఏర్పాటు చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్ణయించింది. భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఆంధ్రకు చెందిన వికెట్ కీపర్-బ్యాటర్ రవి కల్పనల పేర్లను ఈ స్టాండ్లకు పెట్టనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ నెల 12న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ మహిళల ప్రపంచకప్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో, అదే రోజు ఈ స్టాండ్లను అధికారికంగా ప్రారంభించనున్నారు. మహిళా క్రికెటర్ల సేవలను గుర్తించి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏసీఏ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa