భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా స్టార్ ప్లేయర్ హికారు నకమురా ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆ తర్వాత ఇదంతా నిర్వాహకుల ప్రణాళికలో భాగమేనని తెలియడంతో కథ మలుపు తిరిగింది.టెక్సాస్‌లో ఆదివారం 'చెక్మేట్: యూఎస్ఏ వర్సెస్ ఇండియా' పేరిట జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో గుకేశ్‌పై నకమురా విజయం సాధించాడు. గెలిచిన వెంటనే, ప్రత్యర్థికి చెందిన రాజు పావును తీసుకుని ప్రేక్షకుల మధ్యలోకి విసిరేశాడు. ఈ చర్యను చూసిన క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న గుకేశ్‌ను, చదరంగం ఆటను అగౌరవపరిచేలా నకమురా ప్రవర్తించారని తీవ్రంగా విమర్శించారు.రష్యా చెస్ దిగ్గజం వ్లాదిమిర్ క్రామ్నిక్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించాడు. "ఇది కేవలం అనాగరికం మాత్రమే కాదు, ఆధునిక చదరంగం పతనానికి నిదర్శనం" అని ఆయన వ్యాఖ్యానించాడు. నకమురా లాంటి క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా ఆటకు నష్టం కలుగుతోందని ఆయన ఆరోపించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa