భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (అక్టోబర్ 7) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. పుతిన్ 73వ పుట్టినరోజు సందర్భంగా మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన్ను మంచి ఆరోగ్యంతో, అన్ని రంగాల్లో విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా, ఇద్దరు నాయకులు భారత్-రష్యా మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. పరస్పర సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న నిబద్ధతను ఇద్దరూ పునరుద్ఘాటించారు.భారతదేశం–రష్యా మధ్య ఉన్న ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢంగా మార్చే దిశగా ఇద్దరు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ భాగస్వామ్యాన్ని తదుపరి దశకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా, ప్రధానమంత్రి మోదీ అధ్యక్షుడు పుతిన్‌ను భారత్‌ను సందర్శించమని ఆహ్వానించారు. 23వ భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన్ను స్వాగతించాలనే ఆకాంక్షను వెల్లడించారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఒక ముఖ్యమైన అవకాశంగా నిలవనుంది.రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత పుతిన్‌కు ఇది భారతదేశానికి మొదటి పర్యటన కానుంది. ఆయన 2021లో భారత్‌ను చివరిసారిగా సందర్శించారు. 23వ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారని సమాచారం ఉన్నప్పటికీ, పర్యటన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఇటీవల సెప్టెంబర్ 17న పుతిన్, మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ప్రతిస్పందనగా ప్రధాన మంత్రి మోదీ ‘X’ (గతంలో ట్విట్టర్)లో స్పందిస్తూ, “నా స్నేహితుడు అధ్యక్షుడు పుతిన్, నా 75వ పుట్టినరోజు సందర్భంగా మీరు వ్యక్తం చేసిన శుభాకాంక్షలకు, ఫోన్‌కాల్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్–రష్యా మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 1952, అక్టోబర్ 7న అప్పటి లెనిన్‌గ్రాడ్ (ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్)లో జన్మించారు. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో నాజీ జర్మనీ ముట్టడిలో ఈ నగరం తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది. యుద్ధ సమయంలో పుతిన్ తండ్రి వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్ మరియు తల్లి మరియా ఇవనోవ్నా షెలోమోవా కూడా అనేక కష్టాలను ఎదుర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa