MacBook Air M4 Discount: ఆపిల్ మ్యాక్‌బుక్ కొనాలని భావిస్తున్నవారికి గుడ్ న్యూస్!మ్యాక్‌బుక్ ఎయిర్ M4 పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉందని మీకు తెలుసా?ఆపిల్ మ్యాక్‌బుక్‌పై రూ.₹18 వేల వరకు భారీ తగ్గింపు పొందవచ్చు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్‌లో లేదు. ఈ ప్రత్యేక డీల్ విజయ్ సేల్స్‌లోనే లభిస్తుంది. MacBook Air M4 అనే శక్తివంతమైన ల్యాప్‌టాప్‌ను ఈ సేల్స్‌లో తగ్గింపు ధరల్లో పొందవచ్చు.ఇది ఒక మంచి అవకాశం!కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నవారికి ఇది అద్భుతమైన ఎంపిక అని నిపుణులు సలహా ఇస్తున్నారు. అన్ని ఆఫర్లు కలిపి ఈ పరికరంపై గణనీయంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. Apple MacBook Air M4 ప్రారంభ ధర రూ.99,900 నుండి మొదలవుతుంది. ఇది 16GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది.విజయ్ సేల్స్ ఈ ల్యాప్‌టాప్‌పై రూ.8 వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తుంది. అదనంగా, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ICICI మరియు SBI కార్డులపై రూ.10 వేల ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ రెండు ఆఫర్లు కలిసి ₹18,000 వరకు తగ్గింపుతో ఈ ల్యాప్‌టాప్ రూ.81,900కి పొందవచ్చు.
*MacBook Air M4 ప్రత్యేకతలు : MacBook Air M4లో అత్యాధునిక M4 ప్రాసెసర్ ఉంది, ఇది గత మోడల్ కన్నా మెరుగైన పనితీరును అందిస్తుంది. 13.6-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, 10-కోర్ CPU దీని ముఖ్య ఆకర్షణలు. 12MP ఫ్రంట్ కెమెరా సెంటర్ స్టేజ్, డెస్క్ వ్యూ ఫీచర్లతో వస్తుంది, ఇది వీడియో కాల్స్ మరియు కంటెంట్ క్రియేషన్‌కు అద్భుతంగా పనిచేస్తుంది.కంపెనీ ప్రకారం, ఈ ల్యాప్‌టాప్ 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది, దీని ద్వారా మీరు ఆరు గంటల పాటు ఛార్జింగ్ లేకుండా ఉపయోగించుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa