గుంటూరు కలెక్టరేట్ లో డిసెంబర్ 13న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర కోశాధికారి పులిపాక ప్రసాద్, కార్యనిర్వహణ కార్యదర్శి రావూరి ఆంజనేయులు, జాబ్ మేళా మెంబర్ కొప్పర్తి సీతా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa