ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరియా కొరీనాకు నోబెల్‌ శాంతి బహుమతి

international |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 03:01 PM

ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి-2025 వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచాడోను వరించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఆమెను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు నార్వే అకాడమీ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ పురస్కారం కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.వెనెజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్‌ కమిటీ వెల్లడించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని.. గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వెనెజువెలా పార్లమెంట్‌ సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా కొనసాగుతున్నారు. వెనెజువెలా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె.. శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషిచేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్‌ కమిటీ వెల్లడించింది.


నోబెల్‌ శాంతి బహుమతిని 1901 నుంచి 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి. ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా పాకిస్థాన్‌కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ నిలువగా.. జోసెఫ్‌ రాట్‌బ్లాట్‌ 86 ఏళ్ల వయసులో దీనిని అందుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa