ట్రెండింగ్
Epaper    English    தமிழ்

148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో జైస్వాల్ అరుదైన ఘనత

sports |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 08:16 PM

దిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్టార్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ (173) అరుదైన ఘనత సాధించాడు. 23 ఏళ్ల వయసులోనే టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధికంగా 5 సార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఆసీస్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ (8 సార్లు) అగ్రస్థానంలో ఉండగా, జైస్వాల్ రెండో స్థానంలో నిలిచాడు. జైస్వాల్ చెలరేగడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa