భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్ల విరామం తర్వాత విమానయాన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఈ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఢిల్లీ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరానికి నవంబర్ 10 నుంచి రోజువారీ డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు శనివారం ప్రకటించింది.ఇండిగో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మార్గంలో ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని నడపనున్నారు. ఢిల్లీలో రాత్రి 9:45 గంటలకు బయలుదేరే విమానం, మరుసటి రోజు ఉదయం 4:40 గంటలకు గ్వాంగ్‌జౌ చేరుకుంటుంది. తిరిగి గ్వాంగ్‌జౌలో ఉదయం 5:50 గంటలకు బయలుదేరి, అదే రోజు ఉదయం 10:10 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ సర్వీసులకు సంబంధించిన టికెట్ల బుకింగ్ ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. ఇటీవలే కోల్‌కతా నుంచి గ్వాంగ్‌జౌకు కూడా ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa