కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు గుప్పించారు. తనలాగే సాధారణ కుటుంబంలో జన్మించిన పెమ్మసాని.. చదువుకొని అమెరికా వెళ్లి డాక్టర్‌గా పని చేస్తూ.. ఐటీ కంపెనీ స్థాపించాడని.. బాగా డబ్బులు సంపాదించి, ఆ తర్వాత ప్రజా సేవ చేయడం కోసం స్వదేశానికి తిరిగొచ్చాడని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత ఎంపీగా సునాయాసంగా గెలిచి.. కేంద్ర మంత్రిగా జాక్‌పాట్ కొట్టాడన్నారు. ఇంత త్వరగా అందరికీ అవకాశాలు రావని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రైతులు డబ్బులు దుర్వినియోగం చేయొద్దని.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే అనుకున్న స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa