ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తి కోసం భర్తను దారుణంగా కొట్టిన భార్య!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 07:38 PM

భర్తపై ఓ భార్య దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ లో ఇటీవల చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సదరు మహిళ తన కుటుంబ ఆస్తిలో వాటా డిమాండ్ చేయడంతో.. ఆస్తిని పంచడానికి భర్త, ఆమె అత్త నిరాకరించారు. దీంతో ఈ వాదన తరువాత, ఆ మహిళ ఇంటి బయట స్పృహ కోల్పోయినట్లు నటించిందని కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం తనను కొట్టారని, నడవలేకపోతున్నానని సోదరుడితో చెప్పిందని, దీంతో అక్కడికివచ్చిన ఆమె సోదరుడు బావపై దాడి చేశాడన్నారు. ఈ క్రమంలో భార్య కూడా భర్తపై దాడి చేయడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa