విశాఖపట్నంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మంగళవారం నిర్వహించిన అష్టదళ పద్మారాధన సేవలో ఉభయ దాతలు, వేదపండితులు, అర్చకులు భక్తి నిష్ఠతో పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో భక్తులు సుఖశాంతులు పొందాలని ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పవిత్ర సేవ ప్రతి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించబడుతుంది అని ఆలయ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa