చైనాలో మరోసారి భూకంపం వచ్చింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని లుషాన్ కౌంటీలో 4.7 తీవ్రతతో భూమి కంపించింది. మంగళవారం తెల్లవారుజామున 3:21 గంటలకు సంభవించిన ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ వెల్లడించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. లుషాన్, చెంగ్డూ, లెషాన్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa