AP: శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలానికి రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని అధికారులు ప్రకటించారు. హైదరాబాద్–శ్రీశైలం, దోర్నాల–శ్రీశైలం రహదారులలో వాహన రాకపోకలను ఆ సమయానికి తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa