టెక్ ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) రాక, ఆర్థిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల నేపథ్యంలో అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఈసారి తన హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) విభాగంలో 15% వరకు ఉద్యోగులను తొలగించనుంది. హెచ్‌ఆర్‌తో పాటు ఇతర విభాగాలపై కూడా ఈ లేఆఫ్స్ ప్రభావం చూపనుంది. అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. గత ఏడాది 27,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa