గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న రైలులో దారుణం జరిగింది. రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. కత్తితో బెదిరించి అత్యాచారం చేసి, హ్యాండ్‌బ్యాగ్ లాక్కొని పరారయ్యాడు. అనంతరం ఏపీలోని పెద్దకూరపాడు రైల్వే స్టేషన్‌లో దిగిపోయాడు. బాధితురాలు చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa