పాకిస్థాన్ , ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో గత కొంత కాలంగా తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులకు పాల్పడుతున్నాయి. ఈక్రమంలో 48 గంటల పాటు ఇరు దేశాలు తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నాడు ఈ ఒప్పందాన్ని పొడిగించినట్లు ఇరు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన వెలువడిన కాసేపటకే పాక్ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. ఆఫ్గన్ మీద వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో పలువురు ఆఫ్గన్ క్రికెటర్లు మృతి చెందారు. ఆ వివరాలు..
మలబద్ధకంతో బాధపడుతున్నారా, ఇప్పుడు చెప్పేవి తింటే క్షణాల్లో కడుపు మొత్తం ఖాళీ అయి చాలా రిలాక్స్‌గా ఉంటారు
పాకిస్తాన్, ఆఫ్గన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక శుక్రవారం, ఇరు దేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించినట్లు ప్రకటించాయి. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. పాక్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. ఆఫ్గనిస్థాన్‌పై వైమానిక దాడులకు పాల్పడింది.
ఆఫ్గన్ మీడియా సంస్థ TOLO News ప్రకారం.. శుక్రవారం రాత్రి పాకిస్థాన్.. ఆఫ్గన్, పక్తికా ప్రావిన్స్‌లోని పలు జిల్లాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సాధారణ పౌరుల ఇళ్లు కూడా లక్ష్యంగా చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా అనేక మంది మరణించినట్లు సమాచారం. పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. క్రికెట్ ఆడి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు ఆఫ్గన్ క్రికెటర్లు కూడా ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది.
క్రికెటర్ల మృతిపై ఆఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్టు (ACB) ఒక ప్రకటన చేసింది. మరణించిన ముగ్గురు ఆటగాళ్ల వివరాలు వెల్లడించింది. పాక్ వైమానిక దాడుల్లో.. కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ అనే ముగ్గురు క్రికెటర్లు మృతి చెందినట్లు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అలానే ఈ దాడుల్లో మరో ఐదుగురు కూడా చనిపోయారని సమాచారం. పెద్ద సంఖ్యలో జనాలు గాయపడ్డారని తెలుస్తోంది. పాక్ చర్యల నేపథ్యంలో ఆఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకోవడమే కాక.. ఆ దేశంలో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుండి వైదొలగినట్లు ఆఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
TOLO News ప్రకారం.. ఆఫ్గనిస్తాన్, పాకిస్థాన్ మధ్య 48 గంటల కాల్పుల విరమణను.. పాక్ అభ్యర్థన మేరకు.. దోహాలో జరుగుతున్న చర్చలు ముగిసే వరకు పొడిగించారని తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఆఫ్గనిస్తాన్ రక్షణ మంత్రి నేతృత్వంలోని ఆఫ్గన్ ప్రతినిధుల బృందం శనివారం దోహాకు బయలుదేరనుంది. దీని కన్నా ముందే పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa